ఈమధ్య మన టాలీవుడ్ స్టార్స్ కేవలం తెలుగు మీదనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలపై కూడా కన్నేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 'బాహుబలి' చిత్రం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. మరోవైపు పవన్ కూడా తన 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో బాలీవుడ్‌పై దాడి చేయనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, హృతిక్‌రోషన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్స్ తాము నటించే చిత్రాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో విడుదలకు సిద్దమవుతున్న షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్'ను కూడా తెలుగులో విడుదల చేయడానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. గతంలో కూడా షార్‌ఖ్ నటించిన 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే, దిల్‌సే, హ్యాపీ న్యూ ఇయర్, రా..వన్' వంటి పలు చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. వీటిల్లో కేవలం 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే' మాత్రమే టాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించింది. మరి 'ఫ్యాన్' చిత్రం మన ఆడియన్స్‌ను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది.