Advertisementt

కీర్తి మనసు మార్చుకుందా?

Sat 19th Mar 2016 01:12 PM
keerthi suresh,nenu sailaja,ram charan,glamour show  కీర్తి మనసు మార్చుకుందా?
కీర్తి మనసు మార్చుకుందా?
Advertisement
Ads by CJ

'నేను శైలజ'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ కీర్తిసురేష్‌ భవిష్యత్తులో స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని అందరూ భావించారు కానీ ఆమె గ్లామర్‌ షోకు నో చెప్పడంతో ఆమెకు అనేక అవకాశాలు మిస్‌ అయ్యాయి. అందులో రామ్‌చరణ్‌, మహేష్‌బాబుల చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె గ్లామర్‌షో చేయకపోయినా ఆమెకు ఉన్న టాలెంట్‌ చూసి కోలీవుడ్‌లో విజయ్‌, ధనుష్‌ నుండి శివకార్తికేయన్‌ వరకు అందరితో అవకాశాలు సంపాదించుకొంది. కానీ టాలీవుడ్‌లో టాలెంట్‌ కన్నా గ్లామర్‌షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని గ్రహించిన కీర్తిసురేష్‌ తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె వేషధారణ, ఫోజులు అద్బుతంగా ఉన్నాయని, ఆమె గ్లామర్‌షోతో, అందాల ఆరబోతతో అదిరిపోతోందని అంటున్నారు. అంటే కీర్తిసురేష్‌ తను చేస్తున్న తప్పును తెలుసుకొని గ్లామర్‌షోకు కూడా రెడీ అనే సంకేతాలను దర్శకనిర్మాతలకు హింట్‌ ఇచ్చిందని అంటున్నారు టాలీవుడ్‌ జనాలు. ఆమె కనుక తన ఒట్టును తీసి గట్టున పెడితే ఇక ఆమెకు టాలీవుడ్‌లో కూడా వరుస చిత్రాలు క్యూకట్టడం ఖాయం అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ