కుర్రహీరోలలో ఇప్పుడు నాని మంచి ఊపుమీదున్నాడు. నేచురల్ స్టార్‌గా పిలవబడుతున్న ఆయన ప్రస్తుతం తనను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఏప్రిల్ రెండోవారంలో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. ఆ వెంటనే నాని తన తర్వాతి చిత్రం షూటింగ్‌ను అదే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'ఉయ్యాల..జంపాల' ఫేమ్ విరించి వర్మతో ఆయన తన తాజా చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. కాగా ఈ చిత్రంలో మలయాళ భామ అను ఎమాన్యూల్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం తర్వాత కూడా నాని వరుస చిత్రాలను చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. కాగా తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'సేతుపతి' చిత్రం అద్భుతంగా ఆడుతోంది. ఈ చిత్రం ఓ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో తెరకెక్కింది. కాగా ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించడానికి నాని బాగా ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈచిత్రం రీమేక్‌పై మరో యువహీరో సందీప్‌కిషన్ కూడా కన్నేశాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ రీమేక్‌లో నటిస్తారు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరి ఆ చిత్రం రీమేక్ రైట్స్ ఎవరు పొందుతారు? వారు ఏ హీరోతో ఈ చిత్రం చేస్తారు? అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.