నిన్న సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక స్టేజి పైన చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజయిన ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం వరకు గానీ యూ ట్యూబులో దర్శనమీయలేదు. సాధారణంగా అయితే స్టేజి మీద ఆవిష్కరించిన మరు క్షణమో లేక ఓ గంట వ్యవధిలోనే స్టార్ హీరోల సినిమా టీజర్లు, ట్రైలర్లు అభిమానులని అలరించడానికి యూ ట్యూబులో చేరిపోతాయి. అందుకు భిన్నంగా సర్దార్ ట్రైలర్ మార్కెట్టులోకి రావడానికి సుమారుగా ఓ రోజు టైం తీసుకుంది. ఇదే తంతు మొన్న నాగార్జున, కార్తీ ఊపిరి సినిమాకు కూడా జరిగింది. సౌండ్ ట్రాక్ విషయంలో టెక్నికల్ ప్రాబ్లం ఏదో తలెత్తిందని అప్పుడు ఊపిరి విషయంలో చెప్పారు. మరి సర్దార్ కూడా అలాంటి సమస్యే ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ కొందరు మాత్రం సర్దార్ ట్రైలర్ అభిమానులని, సామాన్య ప్రేక్షకులని కాస్త నిరాశకు గురి చేయడంతో కావాలనే ఇలా ఆలస్యం చేసారని చెవులు కొరుక్కున్నారు. యూ ట్యూబులో ఈ ట్రైలర్లు చూసే జనాల సంఖ్యను కూడా ఓ రికార్డుగా అభివర్ణించే ఫ్యాన్స్ ఉండగా సర్దార్ ఇలా సద్దుమనగడం నిజంగా ఆలోచించాల్సిన అంశమే. ఇక ట్రైలర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి, పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సత్తా ఏమిటన్నది రేపు సాయంత్రంకల్లా తెలిసిపోద్ది!