Advertisementt

ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న బాలయ్య!

Wed 23rd Mar 2016 07:07 PM
balakrishna,yodhudu,horse riding,special training  ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న బాలయ్య!
ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న బాలయ్య!
Advertisement
Ads by CJ

తన 100వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ క్రిష్‌ దర్శకత్వంలో చారిత్రక కథాంశంతో ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇది రాజుల కాలంనాటి వాస్తవ కథాంశం కావడంతో బాలయ్య పూర్తిగా తన మేకోవర్‌పై దృష్టి పెట్టాడని, నడక, నడత, డైలాగ్‌ డెలివరీ వంటి వాటిని తనకు తగ్గ విధంగా మార్చుకోవడానికి కష్టపడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఆయనకు గుర్రపుస్వారీ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. గతంలో కొన్ని చిత్రాలలో బాలయ్యకు గుర్రపుస్వారీ చేసిన అనుభవం ఉన్నప్పటికీ ఈ చిత్రంలో ఆయన పూర్తిస్థాయిలో గుర్రపుస్వారీ చేయాల్సివుండడంతో ఇప్పుడు గుర్రపుస్వారీ విషయంలో ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. ఏదో డూప్‌లతో పని చేయించే విషయంలో పూర్తి వ్యతిరేకి అయిన బాలయ్య ఎంత కష్టమైనా సరే పూరి పర్‌ఫెక్షన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా డేరింగ్‌ నిర్ణయంగా చెప్పుకోవాలి. ఏవో గ్రాఫిక్స్‌ మాయాజాలం కాకుండా తానే ఆయా సీన్లలో నటించడానికి ఈ వయసులో కూడా ఆయన ఇంత కష్టపడటం చాలా గొప్పవిషయమని ఫిల్మ్‌నగర్‌ వర్గాలతోపాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాగా ఈచిత్రానికి 'యోధుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ