Advertisementt

అన్నయ్య మాట పవన్ వింటాడా..?

Wed 23rd Mar 2016 07:16 PM
chiranjeevi,pawan kalyan,sardhar gabbar singh  అన్నయ్య మాట పవన్ వింటాడా..?
అన్నయ్య మాట పవన్ వింటాడా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ల మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎంతో కాలం తర్వాత... కాదు.. కాదు.. ఏకంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు కలిసి కనిపించడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక పవన్‌కళ్యాణ్‌ విషయానికి వస్తే అతను సామాన్యంగా ఏ విషయం ఫిక్స్‌కాడు.. అయ్యాడంటే మాత్రం ఇక అనుకొన్నది చేసితీరుతాడు. తాజాగా ఆయన బాలీవుడ్‌ క్రిటిక్‌ అనుపమచోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రెండు మూడు చిత్రాల తర్వాత తాను సినిమాలు చేయనని చెప్పాడు. ఈ విషయం విన్న అభిమానులు ఎంతో దిగులుపడ్డారు. వారిలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉన్నాడని 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియో వేడుకలో అభిమానుల సాక్షిగా నిరూపించాడు. పవన్‌కు జోడు గుర్రాల స్వారీ చేసే సామర్ధ్యం ఉంది... అంటూనే ఆయన సినిమాలు మానేయవద్దని ఫ్యాన్స్‌ సమక్షంలో పవన్‌కు హితబోధ చేశాడు. అంటే ఒక విధంగా తాను చేసిన తప్పును పవన్‌ చేయవద్దని ఇన్‌డైరెక్ట్‌గా హితబోధ చేశాడు. మరి తన తల్లిదండ్రుల తర్వాత తనకు అన్నయ్యే సర్వం అని చెప్పిన పవన్‌ ఈ సినిమాలకు దూరమయ్యే విషయంలో తన అన్నయ్య మాటకు విలువ ఇస్తాడా? లేక తన మాట మీదనే నిలబడతాడా? అనేది చూడాలి. వాస్తవానికి పవన్‌కు సినిమాలు చేసే విషయంలో పెద్దగా ఆసక్తిలేదని, తన జీవనం గడవడానికి ఏదో డబ్బుల కోసమే ఈ వృత్తిలో ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటుంటారు. మరి పవన్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్నది మాత్రం వాస్తవం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ