Advertisementt

సరికొత్త పాత్రలో కార్తీ..!

Fri 25th Mar 2016 02:02 PM
maniratnam,karthi,pilot role,sai pallavi  సరికొత్త పాత్రలో కార్తీ..!
సరికొత్త పాత్రలో కార్తీ..!
Advertisement
Ads by CJ

'ఓకే బంగారం' సినిమాతో మరలా ఫామ్‌లోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం ఆతర్వాత పలు చిత్రాలను చేయాలని భావించాడు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. కాగా త్వరలో మణిరత్నం కార్తి హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో కార్తి ఓ పైలెట్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో ఆయన డిఫరెంట్‌ లుక్‌తో కనిపించనున్నాడట. హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంచుకున్నారు. ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తుండగా, మిగిలిన పాత్రకు కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌ నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో మణిరత్నం బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఓ క్యూట్‌లవ్‌స్టోరీ రూపొందనుందని సమాచారం. కాగా ప్రస్తుతం కార్తీ నాగార్జునతో కలిసి నటిస్తున్న 'ఊపిరి' చిత్రం రేపు తెలుగుతో పాటు తమిళంలో కూడా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో కార్తి నాగ్‌కు కేర్‌టేకర్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఇలా తన నటించే ప్రతి చిత్రంలోనూ తన పాత్రలను డిఫరెంట్‌గా ఉండేలా కార్తీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ