Advertisementt

'ఊపిరి'పై ప్రశంసల వర్షం..!

Sat 26th Mar 2016 04:54 PM
oopiri movie,nagarjuna,karthi,ntr,vamsi paidipalli  'ఊపిరి'పై ప్రశంసల వర్షం..!
'ఊపిరి'పై ప్రశంసల వర్షం..!
Advertisement
Ads by CJ

నిన్న విడుదలైన నాగార్జున-కార్తీలు కలిసి నటించిన 'ఊపిరి' చిత్రం మంచి రేటింగ్స్‌తో, మంచి రివ్యూలతో విమర్శకుల ప్రశంసలతో పాటు సాధారణ ప్రేక్షకులు నుండి కూడా అద్బుతమైన రెస్పాన్స్‌ను అందుకొంటోంది. ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి, అఖిల్‌, నితిన్‌, సుశాంత్‌, సందీప్‌కిషన్‌, నిఖిల్‌ వంటి సిని ప్రముఖులు ఇందులో నాగ్‌, కార్తి, తమన్నాల నటన, వంశీపైడిపల్లి దర్శకత్వ ప్రతిభ, పివిపి సంస్థ కథానుసారం ఖర్చును లెక్కచేయకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడం.. వంటి వాటిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్ర విజయంతో నాగార్జున, కార్తి, తమన్నా, వంశీపైడిపల్లిలు ఒకేసారి హ్యాట్రిక్‌లను అందుకొనడం విశేషం. ఎప్పుడు మాస్‌, కమర్షియల్‌ సినిమాలంటూ మూసధోరణిలో వెళ్లే టాలీవుడ్‌లో ఇలాంటి ఓ ఫీల్‌గుడ్‌ మూవీ వచ్చి, సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతుండటాన్ని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సినిమాకు కొత్త 'ఊపిరి' ఊదిందని అంటున్నారు. ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఎమోషన్స్‌. నాగ్‌, కార్తీల అద్బుమైన నటనతో నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడి నటించారు.. కాదు.. కాదు.. జీవించారు. సపరేట్‌ కామెడీ ట్రాక్‌లు, అనవసర పంచ్‌లు, బకరాలను చేయడం వంటి మూస ధోరణి చిత్రాలకు భిన్నంగా ఉద్వేగాలు, భావావేశాలు, ఎమోషనల్‌ డ్రామా, స్టోరీతో పాటు వచ్చే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కళ్లు చెమ్మగిల్లేలా చేసే సన్నివేశాలు... ముఖ్యంగా 'ది ఇన్‌టచ్‌బుల్స్‌' చిత్రం పాయింట్‌ను మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కష్టం.. ఇవన్నీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అయ్యాయి. ఈ చిత్రంలో కార్తి పాత్రలో మొదట చేస్తానని చెప్పి, ఆ తర్వాత హ్యాండిచ్చిన ఎన్టీఆర్‌ ఈ సినిమా చూస్తే తాను ఎందుకు ఇలాంటి సినిమా, పాత్ర మిస్సయ్యానా అని భాధపడకతప్పదు. అయినా కార్తిని తీసుకోవడం కూడా ఈచిత్రానికి తమిళంలో కూడా మంచి క్రేజ్‌ రావడానికి ఉపయోగపడిందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ