Advertisementt

మోక్షజ్ఞ మనసులో మాట చెప్పేశాడు!

Sun 27th Mar 2016 06:00 PM
mokshagna,balakrishna,moshagna inner fillings,india today,mokshagna about balakrishna  మోక్షజ్ఞ మనసులో మాట చెప్పేశాడు!
మోక్షజ్ఞ మనసులో మాట చెప్పేశాడు!
Advertisement
Ads by CJ

ప్రముఖ మేగజైన్‌ ఇండియాటుడే.. సినీ నటుడు, రాజకీయనాయకుడు బాలకృష్ణపై ఓ ప్రత్యేక ఎడిషన్‌ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ ఎడిషన్‌లో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవితం గురించిన విశేషాలు, సేవారంగంలో ఎన్టీఆర్‌ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్న తీరు వంటి పలు అంశాలపై ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ గురించిన కాలమ్‌ కూడా ఒకటి ప్రచురించారు. అందులో మోక్షజ్ఞ తనకు తన తండ్రికి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. తన తండ్రి తనను ఒక స్నేహితుడిలా చూస్తారని, ఎప్పుడు తనను చదువు కోసం గానీ, సినిమాల్లోకి రమ్మని గాని ఒత్తిడి చేయలేదని తెలిపాడు. తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తండ్రి తనకు వదిలేశారని, అందుకు తండ్రికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అంతేకాదు.. తను ఖచ్చితంగా తన తండ్రి, తాతయ్య నందమూరి తారకరామారావు గార్ల వారసత్వాన్ని కొనసాగించి, అభిమానుల అంచనాలను అందుకుంటాను.. అని తెలిపాడు. మొత్తానికి ఇంత కాలానికి మోక్షజ్ఞ తన మనసులోని భావాలను వెల్లడించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ