అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై అల్లుఅరవింద్ నిర్మిస్తున్న 'సరైనోడు' చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మెగా ఫ్యామిలీలో వరుసగా ఫంక్షన్స్ ఉండటం, తర్వాత 'సర్దార్‌గబ్బర్‌సింగ్' రిలీజ్ ఉండటం, ఆ కొద్దిరోజులకే 'సరైనోడు' రిలీజ్ కూడా ఉండటంతో ఈ చిత్రానికి ఆడియో ఫంక్షన్ చేయకుండా నేరుగా మార్కెట్‌లోకి పాటలను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను మాత్రం వైజాగ్‌లో భారీ ఎత్తున్న ఏప్రిల్ 10న జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండాఫ్ విషయంలో అల్లుఅరవింద్ సంతృప్తిగా లేడని విశ్వసనీయ సమాచారం. సినిమా ప్రారంభం నుంచి ద్వితీయార్ధంపై అల్లు అరవింద్‌కు కొన్ని అనుమానాలు ఉన్నాయట. అందుకే ఆయన ఇప్పుడు కత్తెరపట్టుకొని ఎడిటింగ్ రంగంలోకి స్వయంగా దిగాడని అంటున్నారు. బోయపాటితో కలిసి అల్లుఅరవింద్ సెకండాఫ్‌లో కొన్ని అనవసర సన్నివేశాలకు తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇప్పటికే టీజర్‌తో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటా? అని బయ్యర్లు ఆందోళన చెందుతున్నట్లు ట్రేడ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి.