Advertisementt

శ్రీజ వివాహానికి పవన్ డుమ్మా..!

Wed 30th Mar 2016 02:29 PM
srija,pawan kalyan,no pawan kalyan in srija wedding,chiranjeevi family  శ్రీజ వివాహానికి పవన్ డుమ్మా..!
శ్రీజ వివాహానికి పవన్ డుమ్మా..!
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ రెండో వివాహానికి  పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరుకాలేదని తెలిసింది. బెంగళూరులోని చిరంజీవి ఫామ్‌హౌస్‌లో ఈ సోమవారం జరిగిన ఈ వివాహా వేడుకకు మెగా కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అయితే గత కొంతకాలంగా చిరు-పవన్‌ల మధ్య వున్న దూరం ఇటీవల జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు చిరు హాజరుకావడంతో తొలగిపోయిందని అందరూ భావించారు. శ్రీజ వివాహానికి పవన్ తప్పకుండా వస్తాడని అందరూ ఆశించారు. ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగిన శ్రీజ సంగీత్ వేడుకకు, పెళ్లికి సంబంధించిన ఇతర వేడుకలకు కూడా పవన్ హాజరుకాలేదని సమాచారం. అయితే సర్ధార్ షూటింగ్‌లో బిజీగా వుండటం వల్ల పవన్ హాజరుకాలేదని.. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే రిసెప్షెన్  కు పవన్‌కళ్యాన్ హాజరవుతాడని అంటున్నారు మెగా కుటుంబ సభ్యులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ