'అందాల రాముడు','భీమవరం బుల్లోడు','పూల రంగడు','మర్యాద రామన్న' ఇలా టైటిల్స్ ను ఎన్నుకోవడంలో కొత్తదనాన్ని చూపిస్తుంటాడు హీరో సునీల్. ఇలాంటి టైటిల్స్ సునీల్ కు తప్ప మరెవరికీ సెట్ అవ్వవేమో అన్నట్లుగా సెలెక్ట్ చేసుకుంటాడు. వీరుపోట్ల దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాకు కూడా 'ఈడు గోల్డ్ ఎహే' అనే మరో భిన్నమైన టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సునీల్.. వీరుపోట్ల, వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తోన్న సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలోనే సునీల్.. క్రాంతి మాధవ్ అనే మరో దర్శకుని సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో సునీల్ జాతకాలు పిచ్చి ఉన్న ఓ కోటీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ పాత్ర పేరు 'ఉంగరాల రాంబాబు' అని సమాచారం. ఈ పేరునే సినిమా టైటిల్ గా అనుకొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా.. సునీల్ ఫేట్ మారుతుందేమో చూడాలి..!