Advertisementt

పోలీసోడికి సత్తా చూడాలి!

Thu 31st Mar 2016 03:38 PM
vijay,theri,policeodu  పోలీసోడికి సత్తా చూడాలి!
పోలీసోడికి సత్తా చూడాలి!
Advertisement
Ads by CJ

రజినీకాంత్, సూర్యా, అజిత్, విక్రమ్, కార్తీ... ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ తమిళ హీరోలు అందరికీ తెలుగులో కొద్దో గొప్పో మార్కెట్ ఏర్పడింది, ఒక్క ఇళయదళపతి విజయ్ గారికి తప్ప. తుపాకి లాంటి సినిమాల ద్వారా అంతో ఇంతో పేరు పెంపొందినా బాక్సాఫీస్ దగ్గర ఈయన పేరు చెబితే చిల్లర కూడా రాలని పరిస్థితి ఉంది. తమిళనాడులో రజినీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ కలిగిన మహాశక్తిగా  వెలుగొందుతున్న విజయ్ ఈసారి ఎలాగైనా తెలుగులో పికప్ అందుకోవాలని అనుకుంటున్నాడు. దీనికోసం బడా చేప దిల్ రాజునే వలలో వేసాడు. ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ తమిళ చిత్రం తేరీ తెలుగు అనువాద హక్కులను దిల్ రాజు, కలైపులి ఎస్ తాను సంయుక్తంగా కలిగి ఉన్నారు. తేరీ తెలుగు వర్షనుకు పోలీసోడు అని ఈరోజే నామకరణం చేసి తెలుగులో కూడా సమాంతరంగా తమిళంతో పాటే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తేరీ ట్రైలర్ చూస్తుంటే అత్యద్భుతంగా ఉందని ముందుగానే మనం చెప్పుకున్నాం. పోలీసోడు అన్న మాస్ టైటిల్ గనక తెలుగు జనాల్లో చొచ్చుకుపోయి, సినిమాకు హిట్ టాక్ దక్కితే విజయ్ చిరకాల స్వప్నం నెరవేరినట్టే. రాజా రాణి అనే క్యూట్ ప్రేమకథను మనకు అందించిన అట్లీ ఈ పోలీసోడు చిత్రానికి దర్శకుడు. 

Tags:   VIJAY, THERI, POLICEODU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ