పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కు దర్శకత్వ శాఖలో పట్టు ఉన్నప్పటికీ బాబీను డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. పవన్ కు బాబీ డైరెక్షన్ బాగా నచ్చడంతో తన అన్నయ్య చిరంజీవి దగ్గరకు వెళ్లి.. ''బాబీ చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నాడు. మీరు కూడా తనతో ఒక సినిమా చేయండని'' బాబీను చిరంజీవికి రిఫర్ చేసాడట. చిరు అయితే ప్రస్తుతం వినాయక్ తో కలిసి 150 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి దీని తరువాత బాబీ ఛాన్స్ ఇస్తాడేమో.. చూడాలి. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో కలిసి వర్క్ చేయడం అంత సులువు కాదని.. ఆయనతో పని చేసిన తరువాత నాలో సహనం పెరిగిందని బాబీ చెప్పుకొచ్చాడు. ఆయన్ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరట. ఆయన అప్రిసియేషన్, పొగడ్త, బలం వేరే స్థాయిలో ఉంటాయని బాబీ చెప్పాడు.