డైరెక్ట్ చేసింది ఒక్క సినిమానే అయినా.. ఆ ఒక్క సినిమాతో పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు దర్శకుడు బాబీ. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఏప్రిల్ 8 న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లో భాగంగా బాబీ విలేకర్లతో ముచ్చటించారు. అందులో తనకు ఎదురైన ఒక ప్రశ్నకు బాబీ 'అలా చేస్తే పవన్ ఇంటిముందు ధర్నా చేస్తా' అన్నాడు. బాబీ ఎందుకలా స్పందించాల్సి వచ్చిందో.. అసలు విషయంలోకి వస్తే.. పవన్ ఈ మధ్య రెండు, మూడు సినిమాల తరువాత ఇండస్ట్రీకు దూరమయిపోతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా చేస్తే పవన్ ఇంటిముందు ధర్నా చేసే వాళ్ళలో మొదట నేనే ఉంటానని బాబీ, పవన్ పట్ల తన అభిమానాన్ని తెలుపుకున్నాడు.