మంచు మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, నవీన్ ఇలా పెద్ద కాస్ట్ ను పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ 'ఎటాక్' అనే సినిమాను తెరకెక్కించాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాపై మొదటి షో నుండే నెగెటివ్ ప్రచారం మొదలైంది. రివ్యూలు, రేటింగ్ లు కూడా అలానే వచ్చాయి. ఇది ప్రేక్షకులపై ఎటాక్ అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రివ్యూలతో నేను కూడా అంగీకరిస్తున్నానని హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''నా పాత్రను అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పెర్ఫార్మన్స్ తప్ప సినిమా రిజల్ట్ అనేది మా చేతుల్లో ఉండదు.. లవ్ యు ఆల్.. మీ రివ్యూలతో నేను అంగీకరిస్తున్నాను'' అని ట్వీట్ చేశాడు మనోజ్.