Advertisementt

లారెన్స్‌కి..సూపర్ స్టార్ కి పోలికా!

Sun 03rd Apr 2016 05:44 PM
lawrence,rajinikanth,comparison,lawrence fans  లారెన్స్‌కి..సూపర్ స్టార్ కి పోలికా!
లారెన్స్‌కి..సూపర్ స్టార్ కి పోలికా!
Advertisement
Ads by CJ

వినేవాడు ఉంటే హరిదాసు కూడా ఆంగ్లంలో హరికథ చెబుతాడనే నానుడి ఎప్పటినుండో ఉంది. ఇక సినిమా వాళ్ల విషయానికి వస్తే వారు ఎప్పుడూ తమను తాము ఎక్కువగా ఊహించుకొంటూ ఇతర స్టార్స్‌తో పోటీపడుతున్నట్లు మ్యాజిక్‌ను ప్లే చేస్తుంటారు. తాజాగా ఇటీవల జరిగిన ఓ సంఘటన అందరికీ నవ్వుతెప్పిస్తోంది. మరి లారెన్సే చేశాడో? లేక అయన అభిమానులే చేశారో తెలియదు కానీ, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో కొన్ని స్టిల్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. రజనీకాంత్‌ ఫొటోను పెట్టి దానిలో లారెన్స్‌ స్టిల్‌ను కూడా పెట్టి రజనీ ఇమేజ్‌ను డామినేట్‌ చేస్తున్న లారెన్స్‌ అనే అర్ధం వచ్చేలా కొన్ని పోస్టర్లను క్రియేట్‌ చేసి అందులో లారెన్స్‌ను రజనీతో పోలుస్తూ కొన్ని క్యాప్షన్స్‌ పెట్టారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత లారెన్స్‌ తనకు తానే ఓ విషయాన్ని పోస్ట్‌ చేశాడు. దయచేసి నన్ను రజనీ సార్‌తో పోల్చకండి .. నేను ఇంకా ఆయన స్ధాయికి ఎదిగే క్రమంలో ఉన్నానంటూ కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు. దాంతో ఈ పోస్టర్లను చూసిన వారు, దానికి లారెన్స్‌ కామెంట్స్‌ను చదివిన వారికి నవ్వాగడం లేదు. మొత్తానికి ఇలాంటి చీప్‌ట్రిక్స్‌ ప్లే చేసి తనను తాను రజనీతో పోల్చుకున్న లారెన్స్‌ వ్యవహారం ఇప్పుడు నవ్వులపాలైంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ