Advertisementt

వాళ్ళు అదో రకం..అందుకే మధ్యలో దూరారు!

Tue 05th Apr 2016 01:33 PM
eedo rakam,aado rakam,sardaar gabbar singh,sarrainodu,manchu vishnu,raj tarun,eedo rakam aado rakam release date  వాళ్ళు అదో రకం..అందుకే మధ్యలో దూరారు!
వాళ్ళు అదో రకం..అందుకే మధ్యలో దూరారు!
Advertisement
Ads by CJ

ఒకవైపు సర్దార్... మరోవైపు సరైనోడు మధ్యలో ఈడో రకం ఆడో రకం. చదువుతుంటేనే చిత్రంగా ఉంది. రెండు పెద్ద సినిమాల మధ్య మంచు విష్ణు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అసలే మంచు కుటుంబ హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. తాడును పట్టుకున్నా పాము అవుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో సర్దార్..కు వారం తర్వాత, సరైనోడు వారం ముందు తమ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం సరికాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రెండు  బడా సినిమాలకు ఎక్కువ థియేటర్లు రిజర్వు అయ్యుంటాయి. అన్ రిజర్వు థియేటర్లు అంటే నాన్ ఏ.సి. థియేటర్ల మాత్రమే విష్ణు సినిమాకు లభ్యమయ్యే అవకాశం ఉంది. అసలే ఎండాకాలం. సూర్యప్రతాపం 42 దాటింది. ఇంతటి వేడిలో నాన్ ఏ.సి. థియేటర్లలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారా అనే ట్రేడ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. వినోదాత్మక కథనంతో తీసిన ఈడో రకం ఆడోరకం చిత్రానికి మెుదటివారాంతానికి సర్దార్...ఖాళీ చేసే థియేటర్లు లభిస్తాయని వన్ వీక్ తర్వాతే సరైనోడు వస్తుంది కాబట్టి ఆలోపు వచ్చే కలక్షన్లు చాలని చిత్ర సంబంధికులు అంటున్నారు. ఈసారైనా మంచువిష్ణు గట్టెక్కుతాడా అనేది వేచిచూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ