Advertisementt

విదేశాల్లో బిగ్ బి ఐశ్వర్యం !!

Wed 06th Apr 2016 02:13 PM
amitabh bachahn,aishwarya rai bachchan,panama paper,wealth,big b,aish,hidden wealth  విదేశాల్లో బిగ్ బి ఐశ్వర్యం !!
విదేశాల్లో బిగ్ బి ఐశ్వర్యం !!
Advertisement
Ads by CJ

విదేశీ రహస్య ఖాతాల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ పేరు ఉండటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటి వరకు అమితాబ్ ను పెద్దమనిషిగా అందరూ గౌరవిస్తున్నారు. సెలబ్రిటీగా ఆయన హోదా అపారమైనది. సామాన్య ప్రజల్లో ప్రభావితం చేసే అనేక ప్రొడక్ట్ లకు ఆయన మోడల్ గా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. సినీరంగానికి రోల్ మోడల్. ఇలా అనేక అర్హతలున్న బిగ్ బి నల్లదనాన్ని విదేశాల్లో దాచుకోవడం చర్చనీయాంశమైంది. భారతీయ సినీ పరిశ్రమ ఆయనకు సూపర్ స్టార్ హోదానిచ్చింది. భారతీయ సినీ అభిమానులు బిగ్ బి అని ప్రేమగా పిలుస్తారు. ఇంతటి గౌరవ మర్యాదలు అందుకుంటూ దొంగచాటుగా విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు కొనసాగిస్తున్న విషయం బయటపడగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు ఉన్నాయనే ఆత్రేయ చెప్పిన మాట నిజమైంది. సందర్భం వచ్చినపుడల్లా దేశం కోసం సేవలు అందించడానికి సిద్ధమని చెప్పే అమితాబ్ అసలు, సిసలైన విలన్ లా ప్రవర్తించారు. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న ఇమేజ్ ర్యాంక్ పడిపోయింది. దీని ప్రభావం మోడల్ గా ఆయన ప్రచారం చేసే వస్తువులపై కూడా కనిపించే ప్రమాదం ఉందని కార్పోరేట్ సంస్థలు అనుమానిస్తున్నాయి. బిగ్ బితో పాటుగా ఆయన కోడలు సైతం మామబాటలోనే నడిచారు. దేశీయంగా సంపాదించినదంతా విదేశాల్లోకి తరలించారన్నమాట. అభిషేక్ బచ్చన్ కు తగినంత ఆదాయం లేదు లేకపోతే అతను కూడా తండ్రి, భార్య తరహాలోనే ఖాతా తెరిచేవారని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ