Advertisementt

సహ నిర్మాతని పక్కన పెట్టడం సరైనదేనా!

Wed 06th Apr 2016 04:14 PM
sarrainodu,allu aravind,co producer sanam naga ashok kumar,geetha family  సహ నిర్మాతని పక్కన పెట్టడం సరైనదేనా!
సహ నిర్మాతని పక్కన పెట్టడం సరైనదేనా!
Advertisement
Ads by CJ

నిర్మాత తన తోటి నిర్మాతను గౌరవించాలి.  ప్రతి నిర్మాత వరుసగా సక్సెస్ లు తీయలేరు. అయినప్పటికి నిర్మాత గౌరవం తగ్గదు. టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కు ఈ విషయం తెలియకపోదు. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం సరైనోడుకు సహ నిర్మాతగా శానం నాగఅశోక్ కుమార్ వ్యవహరిస్తున్నారు. గతంలో తిరుపతి ప్రసాద్ తో కలిసి శానం పలు హిట్స్ తీశారు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఒప్పందం ఏమిటో తెలియదు కానీ సరైనోడుకు సహ నిర్మాతగా చేరారు. ఇంతవరకు బాగానే ఉంది. తనలాగే సీనియర్ అయిన శానంకు సరైనోడు సెట్లో దక్కిన మర్యాద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనను ప్రొడక్షన్ అసిస్టెంట్ స్థాయికి పరిమితం చేశారు. లొకేషన్ లో చెట్టునీడన కుర్చీ వేసుకుని కూర్చోవడం మినహా మరే గౌరవం దక్కలేదట. యూనిట్ సభ్యులు సైతం శానంను పట్టించుకోలేదని అంటున్నారు. మీడియా ప్లానర్స్ విడుదల చేసే బులెటిన్ లో కూడా శానం చెప్పినట్టుగా వార్త ఉండదు. లిస్ట్ లో మాత్రమే కనిపిస్తుంది. వైజాగ్ హడావుడి గురించి కూడా ఆయనకు తెలియదు. 10వ తేదీన జరిగే వేడుకలో శానంను వేదికపై రానిస్తారా అనేది అనుమానమే. నిర్మాతకు గౌరవం తగ్గిందని వాపోయే వారంతా అల్లు వారు తన సహచర నిర్మాతకు ఇస్తున్న మర్యాద ఏమిటో తెలుసుకుంటే మంచిది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ