Advertisementt

జీనియస్ హీరోతో మారుతి!

Wed 06th Apr 2016 09:42 PM
maruthi,haveesh,genius movie,babu bangaram  జీనియస్ హీరోతో మారుతి!
జీనియస్ హీరోతో మారుతి!
Advertisement
Ads by CJ

'జీనియస్' సినిమాతో పరిచయమయిన హీరో హవీష్ కు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. తను నటించిన 'రామ్ లీలా' సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హీరోను మారుతి డైరెక్ట్ చేయబోతున్నడనే మాటలు వినిపిస్తున్నాయి. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో టాప్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయిన మారుతి ప్రస్తుతం వెంకటేష్ తో 'బాబు బంగారం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో మారుతి, హవిష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దీనికి కారణం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆ సంస్థే నిర్మించనుందని టాక్. మరి ఈ సినిమాతో అయినా హవీష్ కు హీరోగా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ