సినిమా చిత్రీకరణ విషయంలో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా నష్టం కోట్లలో ఉంటుంది. అనుకున్న విధంగా చిత్రీకరణ జరగకపోయినా, ఔట్‌పుట్ సంతృప్తికరంగా లేకపోయినా.. మళ్లీ కోట్లు ఖర్చుపెట్టి రీషూట్ చేయాల్సి వస్తే అది కోట్లతో ముడిపడిన విషయం అవుతుంది. ఇలాంటివి గతంలో చాలా సార్లు జరిగాయి. ఇలాంటి వ్యవహారాలకు పూర్తి బాధ్యత వహించాల్సింది దర్శకుడే. తాజాగా 'బాహుబలి2' విషయంలో అదే జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు చిత్రీకరణ జరిపిన సీన్ల విషయంలో దర్శకుడు రాజమౌళి సంతృప్తికరంగా లేడని, దాంతో ఇప్పటివరకు చిత్రీకరణ జరిపిన పార్ట్‌లోని మెజారిటీ సీన్లను రీషూట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో రీషూట్ చేయడానికి అదనంగా 30కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కానీ రాజమౌళి మాత్రం నిర్మాతలను, చిత్ర యూనిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఖచ్చితంగా రీషూట్ చేయాల్సిందేనని... ఇప్పుడు 30కోట్ల కోసం చూసుకుంటే రేపు సినిమా విడుదలైన తర్వాత 300కోట్లు నష్టం వస్తుందని హెచ్చరించాడని పక్కా సమాచారం. మరి ఈ విషయంలో నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సివుంది!