తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. టాప్ హీరోలు, డైరెక్టర్లు తనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. చిరంజీవి 150వ సినిమాకు, బాలకృష్ణ 100వ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా దేవిశ్రీ నే అనుకుంటున్నారు. ప్రస్తుతం తను మ్యూజిక్ అందించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దేవిశ్రీప్రసాద్ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశాడు. ముందుగా పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేస్తున్న నాల్గవ సినిమా 'సర్దార్' అని.. ఆయనతో ఎన్ని సార్లు కలిసి వర్క్ చేసినా.. వచ్చే కిక్ చాలా కొత్తగా ఉంటుందని దేవి చెప్పుకొచ్చాడు. పవన్ మెలోడీస్ బాగా ఇష్టపడతారట. 'సర్దార్' లో ఆయనకు నీ.. చేపకళ్ళు అనే సాంగ్ ఫేవరేట్ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. అంతేకాదు సినిమాలో పవన్ వేసిన వీణ స్టెప్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని దేవి స్పష్టం చేశాడు.