Advertisementt

అనవసరంగా మహేష్‌ని నమ్ముకుంటున్నాడా!

Sat 09th Apr 2016 06:22 PM
mahesh babu,guna sekhar,prathaparudrudu,rudramadevi,brahmotsavam sets  అనవసరంగా మహేష్‌ని నమ్ముకుంటున్నాడా!
అనవసరంగా మహేష్‌ని నమ్ముకుంటున్నాడా!
Advertisement
Ads by CJ

దర్శకుడు గుణశేఖర్‌తో మహేష్‌బాబుకి మంచి సాన్నిహిత్యం ఉంది. మహేష్‌ కెరీర్‌ను టర్న్‌ చేసిన 'ఒక్కడు' చిత్ర దర్శకుడు గుణశేఖరే. కాగా ఆ తర్వాత ఆయన మీద నమ్మకంతో మహేష్‌ ఆయనకు 'అర్జున్‌, సైనికుడు' చిత్రాలలో అవకాశం ఇచ్చాడు. 'అర్జున్‌' జస్ట్‌ ఓకే అనిపించినా 'సైనికుడు' చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అక్కడ నుండే మహేష్‌ తన చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. వాస్తవానికి తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే.. అనే తత్వం మహేష్‌ది. అంతగా ఈ రెండు చిత్రాలు మహేష్‌పై తీవ్రప్రభావం చూపాయి. ఇక తనపై ఉన్న నమ్మకంతో ఇటీవల గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తీసిన 'రుద్రమదేవి' చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్రలో మహేష్‌ని చేయించడానికి గుణ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు డేట్స్‌ అడ్జస్ట్‌కాలేదు.. అనే నెపంతో మహేష్‌ ఆ పాత్రను తిరస్కరించగా, బన్నీ ఆ పాత్రను అద్భుతంగా పండించాడు. కాగా గుణ తన తర్వాతి ప్రాజెక్ట్‌గా 'రుద్రమదేవి'కి కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు' అనే చారిత్రక కథాంశంతో మరో చిత్రాన్ని తెరకెక్కించే యోచనలో ఆ టైటిల్‌ను కూడా రిజిష్టర్‌ చేయించాడు. 

కాగా ఇటీవల గుణశేఖర్‌ మహేష్‌ నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లి 40 నిమిషాల పాటు మహేష్‌తో ఏకాంతంగా మాట్లాడాడని సమాచారం. వారిద్దరు మాట్లాడిన విషయాలేవీ బయటకు రాకపోయిన 'ప్రతాపరుద్రుడు' స్టోరిని మహేష్‌కు వినిపించేందుకే వెళ్లాడని తెలుస్తోంది. అయినా ప్రస్తుత మహేష్‌బాబుకు ఉన్న కమిట్‌మెంట్స్‌ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌ సాకారం అయ్యే అవకాశాలు లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. అందునా ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో.. తెలియని, నిలకడలేని గుణ కెరీర్‌ను చూసి మహేష్‌.. గుణకు అవకాశం ఇవ్వడని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ