బాహుబలిలా రికార్డ్ సృష్టించాలి, షోలే లాగా ఆడాలి అని మెగాస్టార్ దీవెనలు అందుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ జనంలోకి వచ్చాక రివర్స్ అయింది పెద్దాయన కలలు కల్లమయ్యాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ పాటల వేడుకకు వచ్చి మనస్పూర్తిగా దీవించారాయన. ఇప్పుడేమో సర్దార్... సినిమాపై పరస్పర విరుద్ద రిపోర్ట్ లు రావడం చిరంజీవికి ఇబ్బంది కలిగించి ఉంటుంది. సర్దార్... చిత్రాన్ని ఈ విధంగా తీస్తారని చిరంజీవి కూడా ఊహించిఉండరు. పవన్ తెలివైనవాడని ఆయన నమ్మకం. సినిమాపై ఏ మాత్రం అనుమానం వచ్చినా మరో విధంగా మాట్లాడేవారు.
కొణదెల వంశంలోఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా ఉండాలని మెగాస్టార్ కోరుకున్నారు. బాహుబలిని అధిగమించే సినిమా తమ కుటుంబం నుండే రావాలని కోరిక ఆయనలో కనిపిస్తోంది. సర్దార్ తో అది తీరే అవకాశం లేదు కాబట్టి ఆయన దృష్టి సరైనోడు వైపు మళ్లింది. ఆదివారం ఆయన వైజాగ్ లో నిర్వహిస్తున్న సరైనోడు వేడుకకు హాజరవుతున్నారు. ఇక్కడ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కు ఎలాంటి విషేస్ అందిస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాత్రం ఆల్ ది బెస్ట్ చెబితే చాలని భావిస్తున్నట్టు యూనిట్ వర్గాలు అంటున్నాయి.