మనల్ని అభిమానించే వాళ్లే మన సినిమాకు దర్శకులైతే, మనల్ని బాగా చూపిస్తారు, ఈ మాటలన్నది సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక హీరోను ప్రేరణగా తీసుకుని, సినీరంగానికి వస్తున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు దర్శకులయ్యాక, అదే హీరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే అభిమానులు ఆనందించేలా చూపిస్తారు. పవన్ కల్యాణ్ ను గుంపుల్లో ఒకరిగా నిలబడి చూసి ఆనందించిన అభిమానుల్లో సంపత్ నంది, హరీష్ శంకర్ కూడా ఉన్నారు. హరీష్ కు పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం వచ్చింది. అందులో పక్కా మాస్ లుక్ తో హీరోని చూపించాడు. హిట్ కొట్టాడు. సంపత్ నంది పవన్ వీరాభిమాని, సంపత్ నంది సర్దార్... చిత్రానికి తొలి దర్శకుడు. మధ్యలో ఆయన్ను తప్పించి బాబీని తీసుకున్నారు. సంపత్ సర్దార్... సినిమా చేసువుంటే మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. లేదా గబ్బర్ సింగ్ చేసిన హరీష్ సర్దార్ తీసినా లెక్కలు మరొకలా ఉండేవట. ఏది ఏమైనప్పటికీ బాబీకి అవకాశం వచ్చినా దాన్ని నిరూపించుకోలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.