నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న వందో చిత్రం 'గౌతమీ పుత్రశాతకర్ణి'. క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు క్రిష్ కు ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. దీంతో బాలయ్యతో ఎలా అయినా.. కమర్షియల్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు క్రిష్. అయితే ఈ ప్రాసెస్ లో 'గౌతమీ పుత్రశాతకర్ణి' సినిమాను బాహుబలి సినిమాతో పోల్చి కాస్త తొందరపడ్డాడు క్రిష్. బాహుబలి సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటూ.. విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పాడు. బాహుబలి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తానని చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ మొదలపెట్టక ముందే క్రిష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో తొందరపడి మాట్లాడేస్తున్నాడని పలువురు భావిస్తున్నారు..!