Advertisementt

మహేష్‌ పోస్టర్‌పై ఆసక్తికర చర్చ!

Tue 12th Apr 2016 01:37 PM
mahesh babu,brahmotsavam,ugadi poster,satyaraj,bahubali,mirchi  మహేష్‌ పోస్టర్‌పై ఆసక్తికర చర్చ!
మహేష్‌ పోస్టర్‌పై ఆసక్తికర చర్చ!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ ఉగాది నాడు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్‌ కానుంది. దీంతో ఈ చిత్రంలో ముఖ్యపాత్రలకు తెలుగు, తమిళం రెండు భాషల్లో గుర్తింపు ఉన్న నటీనటులను ఎంచుకున్నారు. కాగా 'మిర్చి' చిత్రంతో అదరగొట్టి, 'బాహుబలి' చిత్రంలో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ స్టార్‌ సత్యరాజ్‌ ఈ  'బ్రహ్మోత్సవం' చిత్రంలో మహేష్‌బాబుకు తండ్రి పాత్రను చేస్తున్నాడు. అయితే తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌లో మహేష్‌ మోకాళ్లపై కూర్చొని ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్న లుక్‌ అందరినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మహేష్‌ చెప్పులు తొడుగుతున్నది తన తండ్రిగా నటిస్తున్న సత్యరాజ్‌కేనని అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ