Advertisementt

మ‌హేష్ త‌మిళ దర్శ‌కుల‌పై గురి పెట్టాడేంటి?

Tue 12th Apr 2016 03:00 PM
mahesh babu,atlee,jayam raja,muragadoss,mahesh babu with tamil directors  మ‌హేష్ త‌మిళ దర్శ‌కుల‌పై గురి పెట్టాడేంటి?
మ‌హేష్ త‌మిళ దర్శ‌కుల‌పై గురి పెట్టాడేంటి?
Advertisement
Ads by CJ

చేయ‌డానికి తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తుండొచ్చు కానీ... మ‌హేష్ దృష్టి  అన్ని భాష‌ల్లో వ‌చ్చే సినిమాల‌పైనా ఉంటుంది. ముఖ్యంగా తమిళం, హిందీ నుంచి వ‌చ్చే ప్ర‌తి సినిమానీ  త‌ప్ప‌నిస‌రిగా చూస్తాడ‌ట‌. చూడ‌ట‌మే కాదు... బాగుంద‌నిపిస్తే వెంట‌నే ఆయా ద‌ర్శ‌కుల‌కి ఫోన్  చేసి అభినందిస్తుంటాడ‌ట‌. వాళ్ల‌తో మాట్లాడాక మంచి క‌థ ఉంటే రండి చేసేద్దాం అని కూడా చెబుతుంటాడు. మ‌హేష్‌లాంటి సూప‌ర్‌స్టార్ నుంచి ఫోన్ రావ‌డ‌మే ఓ పెద్ద విశేషం, ఏకంగా క‌థ వుంటే వ‌చ్చేయండి అంటే ఇక అంత‌కంటే ఏం కావాలి. అందుకే ఆయా ద‌ర్శ‌కులు మ‌హేష్‌ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌ల త‌యారు చేస్తుంటారు. ఇటీవ‌ల త‌మిళ సినిమాల‌పై మ‌హేష్ కాన్సంట్రేష‌న్ మ‌రింత పెరిగింద‌ని తెలుస్తోంది. అక్క‌డి దర్శ‌కుల్ని వ‌రుస‌గా లైన్లో పెట్టేస్తున్నాడు. 

ఆమ‌ధ్య త‌ని ఒరువ‌న్ చూసి వెంట‌నే ద‌ర్శ‌కుడు జ‌యం రాజాకి ఫోన్ చేసి 'మంచి క‌థ ఏదైనా సిద్ధం చేయండి' అని చెప్పాడ‌ట‌. ఇప్పుడు జ‌యం రాజా అదే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే త్వ‌ర‌లోనే మురుగుదాస్‌తో సినిమా మొద‌లుపెట్ట‌బోతున్నాడు మ‌హేష్‌. ఇప్ప‌డు మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. రాజా రాణి, పోలీసోడు సినిమాల్ని తీసిన ద‌ర్శ‌కుడీయ‌న‌. విజ‌య్‌తో తీసిన పోలీసోడు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ శిష్యుడైన అట్లీపై మ‌హేష్‌కి ఎప్ప‌ట్నుంచో గురి ఉంద‌ట‌. రాజా రాణి సినిమాని చూసి మ‌హేష్ ముచ్చ‌ట‌ప‌డ్డాడ‌ట‌. అప్ప‌ట్నుంచి అట్లీతో సినిమా చేయాల‌నే ఆలోచ‌న మ‌హేష్‌కి ఉంద‌ట‌. ఇటీవ‌లే అట్లీ కూడా ఓ లైన్ చెప్పి మ‌హేష్‌ని మెప్పించాడ‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వుండొచ్చ‌ని త‌మిళ్‌, తెలుగు  సినిమా వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే  అది మ‌హేష్ రెండు భాషల్లో న‌టించే మ‌రో చిత్ర‌మ‌వుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ