మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. అయితే మొదట్లోనే ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో ఈ బ్యానర్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తాననే విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించాలని భావించారు. దీనికోసం అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వలన ఇచ్చిన అడ్వాన్సులు పవన్, త్రివిక్రమ్ లు తిరిగి ఇచ్చేసారట. అందుకు గల కారణాలు తెలియాల్సివుంది!