Advertisementt

రూటు మార్చిన యంగ్‌టైగర్‌!

Wed 13th Apr 2016 09:34 AM
young tiger ntr,multi talented,singer,dancer,jr ntr movies,janata garage  రూటు మార్చిన యంగ్‌టైగర్‌!
రూటు మార్చిన యంగ్‌టైగర్‌!
Advertisement
Ads by CJ

నిన్నటివరకు ఎన్టీఆర్‌ కేవలం హిట్స్‌ ఇచ్చిన దర్శకులు, స్టార్‌డైరెక్టర్స్‌ వెనకే పడతాడనే విమర్శ ఉండేది. కేవలం ఫామ్‌లో ఉండేవారితోనే ఆయన చిత్రాలు చేయడానికి ఇష్టపడేవాడు. కానీ 'టెంపర్‌' నుంచి ఆయన శైలి మారింది. అప్పటికీ ఫ్లాప్‌లో ఉన్న పూరీజగన్నాధ్‌తో 'టెంపర్‌' చిత్రం చేశాడు. ఆ తర్వాత '1'(నేనొక్కడినే) వంటి డిజాస్టర్‌ ఇచ్చిన సుకుమార్‌తో 'నాన్నకు ప్రేమతో' చిత్రం చేశాడు. తాజాగా ఆయన కొరటాల శివతో 'జనతాగ్యారేజ్‌' చేస్తున్నాడు. కానీ ఈ చిత్రం తర్వాత మాత్రం ఆయన మరలా టాలెంట్‌ ఉన్న వారితో సినిమాలు చేయనున్నాడు. 'జనతాగ్యారేజ్‌' తర్వాత ఆయన స్టార్‌ రైటర్‌గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయడానికి ఫిక్స్‌ అయ్యాడు. ఆ తర్వాత  'కృష్ణగాడి వీరప్రేమగాథ' ఫేమ్‌ హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. వక్కంతం వంశీ చిత్రం మాస్‌ అండ్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ చిత్రం కాగా, హను రాఘపవూడి మాత్రం ఎన్టీఆర్‌ కోసం ఓ క్యూట్‌ లవ్‌స్టోరీని సిద్దం చేస్తున్నాడు. కెరీర్‌ మొదట్లో కొన్ని ప్రేమకథా చిత్రాలు చేసిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత ఇప్పటివరకు మరలా అలాంటి లవ్‌స్టోరీని చేయలేదు. ఆ లోటును తీరుస్తూ హను రాఘవపూడి డైరెక్షన్‌లో లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ చిత్రం చేయనున్నాడు. కాగా ఇంతవరకు తన చిత్రాలలోనే ఏవో కాలక్షేపంగా పాటలు పాడిన ఎన్టీఆర్‌ ఇటీవల కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా రూపొందుతున్న 'చక్రవ్యూహ' చిత్రం కోసం కన్నడలో పాట పాడాడు. తాజాగా ఆయన బాలీవుడ్‌లో కూడా ఓ పాట పాడనున్నాడని సమాచారం. హృతిక్‌రోషన్‌తో తనకున్న పరిచయం మీద త్వరలో హృతిక్‌ కోసం ఎన్టీఆర్‌ ఓ పాటను పాడనున్నాడట. ఈ ఆల్బమ్ ను హృతిక్‌రోషన్‌ చేయనుండగా, విశాల్‌-శేఖర్‌లు సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ