నేటితరం యంగ్ హీరోలు ఎవడైతే మాకేంటి అనే దారిలో ఉన్నారు. రెండువారాలకు ఒక స్టార్ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా మధ్యలో మిగిలిన ఒక వారంలో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. చాలినన్ని థియేటర్స్ దొరకవని తెలిసినా తమ సినిమాల మీద ఉన్న నమ్మకంతో సాగిపోతున్నారు. బన్నీ, మహేష్‌బాబు, రజనీకాంత్, సూర్య వంటి స్టార్స్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ డోంట్ కేర్ అంటున్నారు. 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కు వారం తర్వాత బన్నీ 'సరైనోడు'కి వారం ముందు మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు హీరోలుగా నటిస్తున్న'ఈడో రకం.. ఆడో రకం' చిత్రం విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 29న నారా రోహిత్ 'రాజా చేయి వేస్తే' చిత్రంతో పాటు సాయిధరమ్‌తేజ్ 'సుప్రీం' కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఇక మే6 వతేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించిన 'అ..ఆ' చిత్రం విడుదల కానుంది. ఇక మే 27న నాగచైతన్య-గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇలా సమ్మర్ సీజన్‌ను స్టార్స్‌తో పాటు చిన్న హీరోలు కూడా క్యాష్ చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.