Advertisementt

పవన్‌కు ఫ్యాక్షనిజం సూటవుతుందా!

Wed 13th Apr 2016 01:03 PM
pawan kalyan,komaram puli,sj suriya,pawan kalyan new movie,vedalam  పవన్‌కు ఫ్యాక్షనిజం సూటవుతుందా!
పవన్‌కు ఫ్యాక్షనిజం సూటవుతుందా!
Advertisement
Ads by CJ

‘కొమరం పులి’లో  కోరమీసంలో అలరించిన  పవన్‌కళ్యాణ్ త్వరలో మరోసారి కోరమీసంతో కనిపించబోతున్నాడట. పవన్-ఎస్‌జెసూర్య కలయికలో రూపొందనున్న చిత్రం కోసం పవన్ సరికొత్త గెటప్‌లో ఫ్యాక్షనిస్ట్ అవతారంలో కనిపించబోతున్నాడు. (ఇది  ‘వేదాలమ్’ రీమేకా కాదా అనేది తెలియాల్సి వుంది ).ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందనున్న ఈ ప్రేమకథలో పవన్ పాత్ర కూడా వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నాడట ఎస్‌జె సూర్య. అయితే ఇప్పటి వరకు పూర్తి ఫ్యాక్షన్ సినిమాలో నటించని పవన్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఫ్లాప్ అవ్వడంతో.. ఈ సినిమా గురించి ఆలోచనలో వున్నాడని తెలిసింది. సర్దార్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కథలో కథనంలో భారీ మార్పులు చేయమని దర్శకుడికి పవన్ చెప్పాడని సమాచారమ్. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మిస్తాడని తెలిసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ