Advertisementt

క్రికెట్‌ అభిమానులకు ఈ ఏడాది స్సెషల్‌ ట్రీట్‌!

Sat 16th Apr 2016 01:42 PM
cricket fans,sachin tendulkar,ms dhoni,azhar,movies on cricket legends  క్రికెట్‌ అభిమానులకు ఈ ఏడాది స్సెషల్‌ ట్రీట్‌!
క్రికెట్‌ అభిమానులకు ఈ ఏడాది స్సెషల్‌ ట్రీట్‌!
Advertisement
Ads by CJ

క్రికెట్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్‌ మరెక్కడా లేదు. ఇండియాలో ఉన్నవి రెండే మతాలు, ఒకటి క్రికెట్‌, రెండు సినిమా. అదేే క్రికెట్‌, సినిమా కలిసిపోతే ఎలా ఉంటుంది? అదే ఈ ఏడాదిలో జరగనుంది. ఈ ఏడాది క్రికెట్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు బాలీవుడ్‌ వర్గాలు. ఇండియాలో బాగా ఫేమస్‌ అయిన ముగ్గురు క్రికెట్‌ లెజెండ్స్‌ జీవితాల ఆధారంగా మూడు బయోపిక్‌ మూవీస్‌ ఈ ఏడాది సందడి చేయనున్నాయి. భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ జీవితం ఆధారంగా 'అజర్‌' చిత్రం రూపొందుతోంది. ఇందులో అజర్‌ పాత్రను ఇమ్రాన్‌హష్మీ పోషిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని జీవితం ఆధారంగా 'ఎం.ఎస్‌.ధోని' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ధోనీ పాత్రలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అనౌన్స్ అయినప్పుడు క్రికెట్‌ అభిమానులు ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితంపై సినిమా వస్తోందని తెలియగానే ప్రతి ఒక్క క్రికెట్‌ అభిమాని ఎంతో సంతోషించారు. 'సచిన్‌... ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాలో సచిన్‌ స్వయంగా నటిస్తున్నాడు. అంటే స్వయంగా సచిన్‌ జీవితాన్ని మనం సచిన్‌ ద్వారానే తెరపై చూడబోతున్నాం. ఈ చిత్రం టీజర్‌ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. సచిన్‌ వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, చిన్నప్పటి నుంచి అంజలితో ప్రేమ, పెళ్లి వరకు అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఈ చిత్రానికి లండన్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్‌ ఎరిక్సన్‌ దర్శకత్వం వహిస్తుండటంంతో ఈ చిత్రం హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ