పవన్‌కళ్యాణ్ తన 20ఏళ్ల కెరీర్‌లో 20 సినిమాలు మాత్రమే చేశాడు. రెండు దశాబ్దాల కాలంలో ఆయన కేవలం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కాగా మరో మూడేళ్లలో సినిమాల నుండి బయటకు వస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు వరుస చిత్రాలతో తన డైరీని నింపేశాడు. తన చిత్రాల విషయంలో దూకుడు పెంచాడు. ఎప్పుడు లేనిది తను ఒకేసారిగా నాలుగైదు చిత్రాలు ప్రకటించేశాడు. ఏప్రిల్ చివరి వారంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే ఈ చిత్రాల అవకాశాలను కేవలం తనకు నచ్చిన వారితోనే చేస్తున్నాడు. మైత్రిమూవీస్, 14రీల్స్, పివిపి వంటివాటిని పక్కనపెట్టి తన స్నేహితుడు శరత్‌మరార్‌తో ఎక్కువ చిత్రాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి ఆర్దికంగా తాను స్ధిరపడేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్.జె. సూర్య తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి మొదట మైత్రి మూవీస్ బేనర్‌లో చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు త్రివిక్రమ్, శరత్‌మరార్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణతో చేయనున్నాడని సమాచారం. ఇక ఆ తర్వాత ఆయన దాసరి నారాయణరావు, ఏ.యం. రత్నం నిర్మాతలుగా మరో రెండు చిత్రాలు చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలలో కూడా తన స్నేహితుడు శరత్‌మరార్‌ను నిర్మాణ భాగస్వామిగా చేయనున్నాడట. ఈ రాబోయే మూడేళ్లలో ఈ కమిట్‌మెంట్లు అన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగే 'రాజా సర్దార్‌గబ్బర్‌సింగ్'ను కూడా చేస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. మొత్తానికి రెండు దశాబ్దాల తన కెరీర్‌లో పవన్ ఇప్పుడు చూపిస్తున్న జోరు ఎప్పుడూ చూపించలేదని చెప్పవచ్చు.