ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎన్నో స్ట్రగుల్స్ ను తట్టుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ఈ నటుడికి మొదటినుండి మాస్ ఫాలోయింగ్ ఎక్కువే.. తను చేసే సినిమాలు కూడా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. అందుకే మాస్ మహారాజా అనే బిరుదు కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా రవితేజ బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఆశక్తి చూపుతున్నాడనే వార్తలు వినిపించాయి. కాని రవితేజకు అలాంటి ఆలోచన లేదట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు హిందీ భాషపై మంచి పట్టు ఉంది. దీంతో హిందీలో నటించమని చాలా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీను నమ్ముకొని ఉన్న నాకు బాలీవుడ్ కు వెళ్ళాలనే కళలు లేవని చెప్పేశాడు రవితేజ. అలానే కథల ఎంపిక విషయంలో.. మాస్ ప్రేక్షకులను నమ్ముకొని అన్నీ మాస్ సినిమాలే చేస్తే ఒక్కోసారి దెబ్బలు తగులుతుంటాయని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మాస్ సినిమాలు చేసే హీరో రవితేజ ఇలాంటి కామెంట్స్ చేసాడేంటా..? అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. అయితే రవితేజ కావాలని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ను ఉద్దేశించి మాట్లాడాడని కొందరు కథనాలను ప్రచురిస్తున్నారు.