Advertisementt

గోవాబ్యూటీ భారీ ఆఫర్‌..!

Sun 17th Apr 2016 09:38 PM
ileyana,goa beauty,ileana offer to producers,ileana tollywood re entry,ileana movies  గోవాబ్యూటీ భారీ ఆఫర్‌..!
గోవాబ్యూటీ భారీ ఆఫర్‌..!
Advertisement
Ads by CJ

ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్లలో ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్న హీరోయిన్‌గా, కోటి రూపాయలు తీసుకున్న మొదటి టాలీవుడ్‌ హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. కాలం మారింది. ఆమె బాలీవుడ్‌ ప్రయాణం కావడం ఆమెకు ఇక్కడ వేషాలు లేకుండా చేసింది. అక్కడే వరసపెట్టి సినిమాలు చేద్దామంటే ఆ అవకాశాలు ఆమెకు బాలీవుడ్‌లో రావడం లేదు. దాంతో మరలా తెలుగులోనే సినిమాలు చేస్తూ, ఇక్కడ బిజీ అవ్వాలనుకుంటోందని సమాచారం. ఆమెకు ఆ ఆలోచన ఉండటం వరకు బాగానే ఉంది. కానీ ఈ గ్యాప్‌లో చాలామంది హీరోయిన్స్‌ టాలీవుడ్‌లోకి ఎంటరై ఏలుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అవకాశాలు ఇచ్చే డైరెక్టర్‌ ఎవరు? పోనీ ఆమెను కెరీర్‌ ప్రారంభంలో ఎంకరేజ్‌ చేసిన దర్శకులైన వైవిఎస్‌ చౌదరి, పూరీ జగన్నాద్‌ వంటి వారు ప్రస్తుతం ఏ హీరో డేట్స్‌ ఇస్తారా? అనే స్ధితిలో ఉన్నారు. ఇందుకు ఇలియానా ఒక ఉపాయం ఆలోచించింది. తన రెమ్యూనరేషన్‌ను సగానికి తగ్గించి డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించి తన మేనేజర్‌ ద్వారా నిర్మాతలకు కబురుపెడుతోంది. మరి ఆమె స్ట్రాటర్జీ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో వేచిచూడాల్సి ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ