Advertisementt

పవన్‌ చిత్రానికి ఇదే ఫైనల్ టైటిలా!

Mon 18th Apr 2016 03:22 PM
pawan kalyan,sj suriya,husharu,pawan kalyan new movie title,husharu pawan movie  పవన్‌ చిత్రానికి ఇదే ఫైనల్ టైటిలా!
పవన్‌ చిత్రానికి ఇదే ఫైనల్ టైటిలా!
Advertisement
Ads by CJ

త్వరలో పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం పవన్‌ ఫాంహౌస్‌లో జరుగుతున్నాయి. దీనిని కొందరు 'ఖుషీ2' పేరుతో పిలుస్తున్నారు. పవన్‌కు ఓ భారీ హిట్టును, భారీ డిజాస్టర్‌ను ఇచ్చిన ఎస్‌.జె.సూర్య ఈ చిత్రం విషయంలో ఎన్నో జాగ్త్రతలు తీసుకుంటున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రం ఓ ఫ్యాక్షన్‌ లవ్‌స్టోరీగా రూపొందనుంది. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తుండగా ఇప్పటికే ముంబైలో రెండు పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఈ చిత్రంలోని ఈ రెండు పాటలకు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'హుషారు' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో వచ్చిన భారీ డిజాస్టర్‌ను ఈ చిత్రం పూడుస్తుందనే నమ్మకంతో పవన్‌ ఉన్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలో అఫీషియల్‌గా తెలియనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ