ఒక సినిమా తీసి నష్టపోతే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మెగాబ్రదర్ నాగబాబుకు బాగా తెలుసు. ఆయన స్వయంగా బాధితుడే. రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీసి ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. చేతులు కాలడంతో మళ్లీ సినిమా నిర్మాణం జోలికిపోలేదు. నాగబాబు పుత్రరత్నం వరుణ్ తేజ్ తన మూడవ సినిమా లోఫర్ తో బయ్యర్లకు కళ్ళు బయర్లు కమ్మేలా చేశారు. వరుణ్ సినిమా కొంటే పరిస్థితి ఇంతదారణంగా ఉంటుందాని సామాన్యులకు సైతం తెలిసింది. కొడుకు ఇమేజ్ డౌనవుతుంటే నాగబాబు నోరు విప్పడం లేదు. తమ కుటుంబ హీరో డ్యామేజీని కాపాడ్డానికి కొణదెల, అల్లు ఫ్యామిలీస్ స్పందించడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వరుణ్ కు బాసటగా నిలిచే ప్రయత్నం చేయడం లేదు. చిరంజీవి తారు రోడ్డు వేశారు మేము సాఫిగా ప్రయాణం చేస్తున్నామంటూ మాట్లాడే నోళ్ళు ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. నటించడంవరకే మా డ్యూటీ నష్టాలతో మాకు లేదు పూచి అనే విధంగా మెగా ఫ్యామిలీ వ్యవహరిస్తోంది. లోఫర్ దర్శకుడిపై జరిగిందని చెప్పబడుతున్న దాడి గురించి కూడా ఎవరూ మాట్లాడడ్డం లేదు. రామ్ చరణ్ ను వెండితెరకు పరిచయం చేసింది, అల్లు అర్జున్ కు దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది పూరి అనే విషయం తెలిసిందే.