Advertisementt

బన్నీకు సర్ది చెబుతున్నాడు..!

Thu 21st Apr 2016 12:18 PM
sarrainodu movie,run time,boyapati sreenu,allu arjun  బన్నీకు సర్ది చెబుతున్నాడు..!
బన్నీకు సర్ది చెబుతున్నాడు..!
Advertisement
Ads by CJ

ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల నిడివి రెండు గంటల పదిహేను నిమిషాలకు మించి ఉండట్లేదు. అంతకు మించి ఉంటే జనాలు చూడడానికి విసుగెత్తిపోతున్నారు. కాని కొంతమంది దర్శకులు మాత్రం నిడివి విషయంలో తమ మాటే నెగ్గాలని వారు అనుకున్న రన్ టైం తో ఉండే సినిమానే రిలీజ్ చేస్తున్నారు. ఈ రకంగా విడుదలయిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. రీసెంట్ గా వచ్చిన ఓ స్టార్ హీరో సినిమా పరిస్థితి కూడా అదే. అయితే తాజాగా 'సరైనోడు' సినిమా విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ర‌న్ టైమ్ 2గంట‌ల 40 నిమిషాలని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఎక్కువైందని ట్రిమ్ చేసే అవకాశాలు ఉన్నా.. బోయపాటి పట్టించుకోవట్లేదని సమాచారం. సినిమా బావుంటే మూడు గంటలైనా.. చూస్తారని బన్నీకు సర్ది చెబుతున్నాడట. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. కానీ వారు అనుకున్న రిజల్ట్ రాకపోతే అప్పుడు ఖచ్చితంగా ట్రిమ్ చేయాల్సిందే..!