హీరో శ్రీకాంత్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకొని శతాధిక చిత్రాల హీరో అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు ఫ్యామిలీ, యూత్‌లో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిన చిత్రాలలో 'పెళ్లిసందడి' మొదటి స్థానంలో ఉంటుంది. ఆ చిత్రం హీరో శ్రీకాంత్ కెరీర్‌కు అనూహ్యమైన టర్న్‌ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించాడు. కాగా త్వరలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 'నిర్మలా కాన్వెంట్' అనే టైటిల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకొంటోంది. కాగా త్వరలో రోషన్ తన తండ్రి నటించిన సూపర్‌హిట్ మూవీ 'పెళ్లిసందడి' రీమేక్ చిత్రంలో నటించనున్నాడని సమాచారం. తనకు లాగే ఈ చిత్రం తన కుమారుడి కెరీర్‌ను కూడా కీలకమైన మలుపు తిప్పుతుందని శ్రీకాంత్ ఆశగా తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎవరి నిర్మాణంలో, ఎవరి దర్శకత్వంలో రూపొందనుందనే విషయం మాత్రం తెలియరావడం లేదు.