Advertisementt

దసరా రేస్ లోకి 'సింగం3'!

Sun 24th Apr 2016 04:15 PM
singam 3,dasara race,suriya,24 movie,vijaya dasami,hari  దసరా రేస్ లోకి 'సింగం3'!
దసరా రేస్ లోకి 'సింగం3'!
Advertisement
Ads by CJ

తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ స్థాయిలో ఇమేజ్‌, క్రేజ్‌ ఉన్న స్టార్‌ సూర్య. కాగా ప్రస్తుతం ఆయన, ఆయన సోదరుడు కార్తిలు పూర్తిగా తెలుగుపై ప్రత్యేక దృష్టి 

సారించారు. కార్తీ నాగార్జునతో కలిసి నటించిన 'ఊపిరి' చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నాడు. మరోపక్క ఆయన అన్న సూర్య తెలుగులో 'శివపుత్రుడు, గజిని' చిత్రాలతో క్రేజ్‌ తెచ్చుకున్నప్పటికీ ఆయనకు ఇక్కడ స్టార్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చిన చిత్రాలు మాత్రం 'యముడు' (సింగం), 'సింగం 2' (సింగం)అనే చెప్పవచ్చు. కాగా మే 6వ తేదీన ఆయన టాలెంటెడ్‌ తెలుగు డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌తో చేస్తున్న '24' చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం సూర్య '24'తో పాటు తనను ఇంతటి స్టార్‌ను చేసిన 'సింగం' సీరిస్‌లో భాగంగా 'సింగం3'పై ఎంతో నమ్మకంతో ఉన్నాడు.ఈ చిత్రానికి కూడా దర్శకుడు హరినే కావడం విశేషం. కాగా ఈచిత్రంతో ఆయన తెలుగులో మరింత ఇమేజ్‌ పెంచడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో స్ట్రయిట్‌ తెలుగు చిత్రం చేయనున్న సూర్య అంతకు ముందు విడుదల కానున్న 'సింగం3' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ నెలలో దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ