ఒక వైపు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం పట్టాలెక్కడంతో మెగా అభిమానులందరూ తమ స్టార్ చిరంజీవి 150వ సినిమా ఆరంభం కోసం మరింతగా పరితపించి పోయారు. చిరంజీవి గారికి బహుశా అభిమానుల మొరను ఆలకించినట్టున్నారు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడుకి ఈ నెల 29న ముహూర్తం ఫిక్స్ చేసారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కత్తిలాంటోడును 29న లాంచ్ చేసి తరువాత వరస షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చేసేందుకు సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ హిట్ కత్తికి తెలుగు రీమేక్ ఈ కత్తిలాంటోడు. ఇప్పటికి ఇంకా చిరు సరసన నటించే హీరోయిన్లు, ఇతరత్రా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రానికి పత్రికా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.