బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా గతంలో అధ్యయన్ సుమన్ అనే హీరోతో ప్రేమాయణం సాగించింది. 2009 లో వీరిద్దరూ కలిసి రాజ్ అనే సినిమాలో నటించారు. అప్పటినుండే వీరి మధ్య రిలేషన్ ప్రేమగా మారిందని సమాచారం. అయితే ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ మధ్య కంగనా, హృతిక్ ల మధ్య జరుగుతున్న వివాదం గురించి అధ్యయన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కంగనా, హృతిక్ లు ఎప్పుడు కలిసినా.. హృతిక్, కంగనాకు చాలా దూరంగా ఉండేవాడట. కంగనానే హృతిక్ ను ఇష్టపడేదట. అంతేకాదు కంగనా చాలా హై టెంపర్ ఉన్న అమ్మాయని చెప్పాడు. తనకు బ్లాక్ మ్యాజిక్ మీద కూడా నమ్మకం ఉందని అధ్యయన్ స్పష్టం చేశాడు. దానికోసం కంగనా అపార్ట్ మెంట్ లో ఓ చీకటి గది కూడా ఉందని చెప్పాడు. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజముందో కంగనాకే తెలియాలి. కాని కంగనా మాజీ ప్రియుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎవరు విశ్వసించకుండా ఉండలేకపోతున్నారు.