Advertisementt

అల్లు గారు వరుణ్ ని మరిచారు!

Sun 01st May 2016 12:35 PM
allu aravind,varun tej,varun new movie,mega family,movie openings,sai dharam teja  అల్లు గారు వరుణ్ ని మరిచారు!
అల్లు గారు వరుణ్ ని మరిచారు!
Advertisement
Ads by CJ

ముహూర్తం ముంచుకొస్తున్న వేళ మెగా కుటుంబ హీరోలు నటించే పలు చిత్రాలకు కొబ్బరికాయ కొట్టారు. మరో మూడు నెలల వరకు ముహూర్తం లేదు కాబట్టి లాంఛనంగా ప్రారంభించారు. చిరంజీవి నుండి సాయిధరమ్ తేజ్ వరకు నటించే చిత్రాల ముహూర్తంలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా అల్లు అరవింద్ ప్రతిచోట హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ వరుణ్ తేజ్ సినిమా ఓపనింగ్ లో మాత్రం అల్లు అరవింద్ కనిపించలేదు. కేవలం నాగబాబు కుటుంబం మాత్రమే వచ్చింది. మెగా ఫ్యామిలీ ఇతర హీరోలు సైతం రాలేదు.  వరుణ్ మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ ఎవరూ హాజరవకపోవడం ఆసక్తికరం. వరుణ్ తేజ్ విషయంలో అల్లు అరవింద్ మొదటినుండి శీతకన్ను వేశారు. సాయిధరమ్ ను ప్రమోట్ చేస్తున్నట్టు వరుణ్ ను చేయడం లేదనేది అందరికీ తెలిసిందే. నాగబాబు తనయుడు కావడం వల్లే అల్లు గారు ఇలా ప్రవర్తిస్తున్నారా? అనే అనుమానం సినీ వర్గాల్లో కలుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ