Advertisementt

ఆ సినిమా చేయడం తప్పంటున్న విక్రమ్‌!

Sun 01st May 2016 07:39 PM
vikram.k.kumar,ishq movie,ishtam movie,alai movie,big mistake  ఆ సినిమా చేయడం తప్పంటున్న విక్రమ్‌!
ఆ సినిమా చేయడం తప్పంటున్న విక్రమ్‌!
Advertisement
Ads by CJ

 

తెలుగులో ఇష్టం చిత్రంతో దర్శకునిగా పరిచయం అయిన తర్వాత 2003లో తమిళంలో అలై అనే చిత్రాన్ని తీశాడు విక్రమ్‌ కె.కుమార్‌. అందులో శింబు - త్రిషలు నటించారు. ఆ చిత్రం అప్పట్లో అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఇప్పుడు ఆ సినిమా గురించి విక్రమ్‌ మాట్లాడుతూ...  నేను అలాంటి సినిమా తీయాల్సింది కాదు. అదో చెత్త సినిమా అని వ్యాఖ్యానించాడు. అలై సినిమా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. సినిమా ఎలా తీయకూడదు  అనేది ఆ చిత్రం చేసిన తర్వాత అర్ధమైంది. నిజంగానే చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న నేను ఆ తర్వాత 13బి, ఇష్క్‌, మనం వంటి విజయవంతమైన చిత్రాలు చేశాను. తాజాగా నేను సూర్యతో చేసిన 24 చిత్రం కూడా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుది అని తన మనోగతాన్ని తెలియజేశారు. కాగా  24 చిత్రం మే 6వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైమ్‌ మెషీన్‌ కథతో సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందింది..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ