Advertisementt

నాగ్‌ - వెంకీలు ఒకే సినిమాలోనా!

Mon 02nd May 2016 12:24 PM
nagarjuna,venkatesh,premam movie,venkey nag combination,naga chaithanya  నాగ్‌ - వెంకీలు ఒకే సినిమాలోనా!
నాగ్‌ - వెంకీలు ఒకే సినిమాలోనా!
Advertisement
Ads by CJ

నాగార్జున - వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటే అభిమానులకు ఆశ్చర్యమే కాదు...  ఆనందం కూడా కలుగుచేస్తుంది. ఇద్దరు కలిసి ఒకే సినిమా చేయడం అంటే మాటలు కాదు..  అసలు ఇప్పటివరకు ఆ ఇద్దరినీ కలిసి పని చేయమని అడిగే సాహసం కూడా ఎవ్వరూ చేయలేదు.  కానీ ఇన్నాళ్లకు నాగచైతన్య ఆ పని చేయగలిగాడు. అటు మామను, ఇటు నాన్నని ఒకే సినిమాకి పనిచేసేలా ఒప్పించాడు. ప్రస్తుతం నాగచైతన్య మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ప్రేమమ్‌ చిత్ర రీమేక్‌లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొంతకాలంగా సరైన హిట్‌లేని నాగచైతన్య ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ప్రేమమ్‌ చిత్రంలో ఇప్పటికే చైతూ మామ వెంకటేష్‌ ఓ కామియో పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రంలో తన తండ్రి నాగార్జున చేత వాయిస్‌ ఓవర్‌ చెప్పించే పనిలో చైతూ ఉన్నాడు. దీనికి నాగ్‌ నుండి కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇలా నాగార్జున - వెంకటేష్‌లు ఇద్దరు కలిసి ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేశారు. మరి సరైన హిట్‌ లేని చైతూకు ఈ చిత్రం ఆ లోటును తీరుస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.