తన స్నేహితుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో తానే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో రూపొందనున్న చిత్రం 'శభాష్‌నాయుడు'. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ నెల 16 నుండి ప్రారంభం కానుంది. దాదాపు 80శాతం షూటింగ్ అక్కడే జరుగనుంది. కాగా ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, కమల్ పెద్ద కుమార్తె శృతిహాసన్ ఈ చిత్రంలో కూడా ఆయనకు కూతురుగా నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో ఓ కీలకమైన పాత్రను బ్రహ్మానందం పోషిస్తుండగా, మరో ముఖ్యపాత్రను పరేష్‌రావల్ పోషిస్తున్నాడు. కాగా ఈచిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. మరో ముఖ్యం విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకత్వ విభాగంలో కమల్ చిన్న కూతురు అక్షరహాసన్ పనిచేయనుంది. ఆమె ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. 'షమితాబ్' చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించిన ఈ అమ్మడు కొన్ని చిత్రాలకు ఆల్‌రెడీ దర్శకత్వ విభాగంలో పనిచేసిన సంగతి తెలిసిందే.