Advertisementt

నేను రాసేసిన డైరీ 'అ ఆ': త్రివిక్రమ్!

Tue 03rd May 2016 05:20 PM
trivikram srinivas,a aa movie,nithin  నేను రాసేసిన డైరీ 'అ ఆ': త్రివిక్రమ్!
నేను రాసేసిన డైరీ 'అ ఆ': త్రివిక్రమ్!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అ ఆ'. ఈ సినిమా ఆడియో లాంచ్ లో త్రివిక్రమ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఆయన మాటల్లో.. ''ఈ సినిమాకు టైటిల్ గా అ ఆ ఎందుకు పెట్టారని అందరు అడుగుతున్నారు. మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం నుండి జీవితం మొదలు పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నాను(నవ్వుతు..). మనం ఎక్కడి నుండి వచ్చామో మరచిపోతుంటాం. ఒక్కసారి వెనక్కి తిరిగి మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటువంటి మూలాలను వెతుక్కునే ప్రయత్నమే 'అ ఆ'. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని ప్రయాణాలను ఆపాలనిపించదు. నన్ను చిన్నప్పటి నుండి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రయాణాలు, అనుభూతులను మర్చిపోలేను. రాసేసిన డైరీను మళ్ళీ తిరిగి చదువుకోవాలనిపిస్తుంది. అలా నేను రాసిన డైరీ అ ఆ ను మరోసారి చదువుకోవాలనిపించింది. దానినే సినిమాగా తీశాను'' అని చెప్పారు.    

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ