Advertisementt

తమన్నాను రిజక్ట్ చేసిన హీరో!

Thu 05th May 2016 06:56 PM
ram,thamanna,santhosh srinivas,rashi khanna  తమన్నాను రిజక్ట్ చేసిన హీరో!
తమన్నాను రిజక్ట్ చేసిన హీరో!
Advertisement
Ads by CJ

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ లో చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అయినా.. తనకు అవకాశాలు రావడం మాత్రం మానలేదు. రీసెంట్ గా బాహుబలి, ఊపిరి చిత్రాల హిట్ టాక్ తో ఐరన్ లెగ్ ముద్ర తొలగించుకొని గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోన్న ఈ భామ నిర్మాతలకు తన రెమ్యునరేషన్ తో షాకిస్తోంది. ఇది ఇలా ఉండగా హీరో రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా తమన్నా ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇది వరకు రామ్, తమన్నా కలిసి 'ఎందుకంటే ప్రేమంటే' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. స్క్రీన్ పై వారి జంట చూడడానికి బావుండడంతో మరోసారి తమన్నానే రామ్ సరసన నటించడానికి సెలెక్ట్ చేశారు. రామ్ మాత్రం తమన్నా వద్దని ఆమె ప్లేస్ లో రాశి ఖన్నా అయితే బావుంటుందని చెప్పాడట. మరి రామ్, తమన్నా ను రిజక్ట్ చేయడానికి కారణాలేంటో... ఆయనకే తెలియాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ